నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట


ఇటీవల సూళ్లూరుపేట RTI గోపీ నాయాక్ ను రాష్ట్ర ప్రభుత్వం  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు డీసీపీ సిరి ఆనంద్ ను   నియమించారు.డీసీపీ ఫైల్స్ ను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు అనంతరం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ 

గతంలో ఉన్న RTI గోపీనాయక్ 2019 వ సంవత్సరం ఆగస్టు నెలలో తడ భీములవారి పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లో విధులు నిర్వహించారు. అక్కడ ఒక సంవత్సరం పాటు విధులు నిర్వహించి బదిలీపై  సూళ్లూరుపేట ఆర్టీవో ఆఫీసర్ గా  గత సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చారని,ఇక్కడ

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సుమారు 300 వాహనాలకు పైగా నెల్లూరు జిల్లాలో అనధికారికంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సులూరుపేట లో సుమారు వందకుపైగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని  వార్తల్లో వచ్చిన కథనాలపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికను అందిస్తానని తెలిపారు.