మైనింగ్, ఎర్ర చందనం, ఇసుక, గంజాయి వంటి అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు 
గ్రేప్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులను లోక్ అదాలత్ లో డిస్పోజ్ చెయ్యొద్దు 
సిసి కెమెరాలను జంక్షన్స్ మరియు బ్లాక్ స్పాట్ లలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి 
ఈవ్ టీజింగ్ ను పూర్తిగా నిర్మూలించాలి 
పాత కేసులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి త్వరగా ఫైనలైజ్ చేయండి

జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయం నందు గూడూరు సబ్ డివిజన్ అధికారులతో జరిగిన నేర సమీక్షా సమావేశంలో అధికారులకు పై ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్టు షాపులపై, నాటు సారా వంటివి పూర్తిగా నిర్మూలించాలని, ఎర్రచందనం, మైనింగ్, ఇసుక, గంజాయి వంటి అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని, గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ లను లోక్ అదాలత్ లో డిస్పోజ్ చేయరాదని, సిసిటిఎన్‌ఎస్‌ లో ప్రతి కేసు వివరాలు పూర్తిగా అప్డేట్ చేసి ఉండాలని, పాత కేసులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పైనలైజ్ చేయాలని, ఈవ్ టీజింగ్ పై కఠినంగా వ్యవహరించాలని, పూర్తిగా నిర్మూలించాలని, సిసి కెమెరాలను మీ పరిధిలోని ముఖ్యమైన కూడలి లలో మరియు బ్లాక్ స్పాట్ లలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనింగ్, ఎర్ర చందనం, ఇసుక వంటి అక్రమ రవాణాపై నిత్యం అప్రమత్తంగా ఉంటూ సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, వైట్ కాలర్ నేరాలను నిరోధించడంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నమోదు అయిన కేసులలో పటిష్టమైన పరిశోధన చేపట్టి ముఖ్యంగా డాకుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగా కేసులను జాప్యం లేకుండా పైనలైజ్ చేయాలని అధికారులకు సూచించారు. గూడూరు సబ్ డివిజన్ లో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా ఆయన సమీక్షించారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, చార్జిషీటు దాఖలు, ఎన్‌బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ మొదలగు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రాత్రి వేళలో నిర్వహించే గస్తీని పటిష్టం చేయాలన్నారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రాపర్టీ క్రైమ్స్, చీటింగ్ నేరాలపై మరియు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ లలో అవినీతికి తావు ఇవ్వొద్దని ఈ సందర్భంగా యస్పి హెచ్చరించారు.ఈ నేర సమీక్షా సమావేశంలో యస్పి తో పాటు గూడూరు డియస్పి బి. భవాని హర్ష, డి.సి.ఆర్.బి., గూడూరు టౌన్ సర్కిల్, గూడూరు రూరల్ సర్కిల్, వెంకటగిరి, నాం సూళ్ళూరుపేట, వాకాడు ఇన్స్పెక్టర్స్, యస్.ఐ. సిబ్బంది హాజరుగా ఉన్నారు.