ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది క‌రోనా. అయితే భార‌త్ లోమ‌హారాష్ట్ర‌లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్య‌ధికంగా కోవిడ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా బారిన సామాన్య జ‌నంతో పాటు మంత్రులు,ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ అధికారులు క‌రోనాకి బ‌లి అవుతున్నారు. ఈ క‌రోనా పోలీస్ శాఖ‌కి కూడా వ్యాపించింది. ఏకంగా 93మంది పోలీసులకి కోవిడ్ పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 9వేల, 657మందికి క‌రోనా వైర‌స్ సోకింది. వారిలో 123మంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం 409మంది పోలీసులు హాస్ప‌ట‌ల్ లో చికిత్స తీసుకుంటున్నారు