అమెరికాలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా.. ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో 4 కోట్ల కరోనా టీకా డోసులు సప్లై చేయగలమని తెలిపింది. టీకా లభ్యతపై ఫైజర్ కంపెనీ సీఈఓ ఆచూతూచి స్పందించారు. అంతా అనుకున్నట్టు జరిగి క్లినికల్ ట్రయల్స్ పూర్తయి కరోనా టీకాకు ప్రభుత్వ అనుమతులు లభిస్తే..ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో ఏకంగా 4 కోట్ల టీకా డోసులను పంపిణీ చేయగలమని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 10 కోట్ల టీకా డోసులు సిద్ధమవుతాయన్నారు.  టీకా ప్రభావశీలపై కూడా ఆయన స్పందించారు. 


ఈ విషయంలో పూర్తి సమాచారం అక్టోబర్ నెలఖరుకి అందుబాటులోకి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం.. అత్యవసర సందర్భాల్లో టీకాను వినియోగించేందుకు వీలుగా ఎమర్జెన్సీ అనుమతి కోసం నవంబర్‌ మూడో వారంలో దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు. టీకా కచ్చితంగా పనిచేస్తుందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఈఓ ఆచితూచి స్పందించారు. ఈ విషయంలో నేను అతివిశ్వాసాన్ని ప్రదర్శిచదలుచుకోలేదు. అయితే..టీకా పనిచేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అని ఆయన వ్యాఖ్యానించారు.