నెల్లూరు, పిబ్రవరి 15, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ పరమేశ్వరి అవెన్యూలో 33లక్షల వ్యయంతో సి.సి రోడ్లు, సి.సి. డ్రైన్ నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 145 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి కృషి చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.