నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, కొండాయపాలెం, బృందావనం కాలనీలలో ప్రజాబాట నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఏదైనా అభివృద్ధి అనేది ప్రజల నిర్ణయం ప్రకారం, ప్రజల భాగస్వామ్యంతో నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కొండాయపాలెం ప్రాంతంలో 10 లక్షల వ్యయంతో మూడురోజుల్లో నిర్మాణపనులు శంకుస్థాపన చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారంలో రూరల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.