రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాలపై 14 వ డివిజన్ పరిధిలోని వేపదొరువు వద్ద నిర్మిస్తున్న కాలువల నిర్మాణ పనులకు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 17 లక్షల రూపాయలు కాలువ నిర్మాణ పనులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు  నిధులు కేటాయించారని తెలిపారు. ఇదే కాకుండా ప్రత్యేకించి డివిజన్ ప్రజలకు మంచి స్వచ్ఛమైన నీటిని తక్కువ ధరకే అందించేందుకు ఏసీ నగర్ పార్కు వద్ద వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించారన్నారు. 2.5 కోట్ల రూపాయలతో 14వ డివిజన్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏ ఇ సౌజన్య , వైసీపీ నేతలు లక్ష్మిరెడ్డి,ప్రసాద్ రెడ్డి,పిచ్చిరెడ్డి, రఘుపతి నాయుడు,  రవికుమార్, ప్రసన్న రెడ్డి, సాకేశ్ రెడ్డి, కె ఎల్ నారాయణ, గిరిధర్ రెడ్డి,నార్ల నాగరాజు, రాజేశ్, మీరా బాషా, శేషురెడ్డి, కృష్ణా రెడ్డి, రామాంజనేయుల రెడ్డి ,కామాక్షయ్య, జగన్ రెడ్డి, రమణ, సుబ్బారెడ్డి,శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.