జగన్ అన్న ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయండి ... తాసిల్దార్ మరియు ఎంపీడీవో కావలి రూరల్ మండల పరిధిలో రుద్రకోట గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను స్థానిక ఎంపిడిఓ వెంకటసుబ్బారావు మరియు తాసిల్దార్ మాధవరెడ్డి పరిశీలించారు అక్కడ ఉన్న స్థానిక హౌసింగ్ ఇంజనీర్ ను అడిగి ఇళ్ల నిర్మాణాలు ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్లకు కావలసిన అన్ని సదుపాయాలు అనగా స్టీలు సిమెంటు ఇటుక కంకర ఇసుక సరఫరా చేయవలసిందిగా తాసిల్దారు ఇంజనీర్లను ఆదేశించారు ఎంపీడీవో వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఎవరైనా వాళ్ళకి డబ్బులు అవసరమైతే పొదుపు ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తామని తెలియజేసినారు తర్వాత ఆమె మడుగు లేఅవుట్ ను కూడా పరిశీలించారు అక్కడ కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయవలసిందిగా స్థానిక సర్పంచ్ ను కోరినారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇంజనీరింగ్ అయ్యప్ప వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు శ్యాంసుందర్ రుద్రకోట ఆమె మడుగు గ్రామ పంచాయితీ సర్పంచులు వాలంటీర్లు పాల్గొన్నారు