నెల్లూరు, జనవరి 11, (రవికిరణాలు) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక బోడిగాడి తోటలో జరిగే పెద్దల పండుగ నిర్వహణా కార్యక్రమాలను నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి శనివారం పరిశీలించారు. సమాధులు ఉన్న ప్రాంతంలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలని, విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. గొబ్బెమ్మల పండుగ జరిగే పెన్నానది యేటి ప్రాంతంలో తగిన రక్షణ చర్యలు తీసుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.