నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శేషగిరి బాబును క్యాంప్ ఆఫీస్ లొ కలిశారు.కొంత మంది రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారు .వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయకుమార్రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి  ఆయనతోపాటు హాజరయ్యారు. తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సహృదయానికి వారికి కృతజ్ఞతలు తెలిపారు