విద్యార్థులకు కో వ్యాక్సిన్


 వాకాడు మండల పరిధిలో ఉన్న విద్యార్థులకు సోమవారం బాలి రెడ్డి పాలెం ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించిన డాక్టర్లు దీప్తి,చూహిత ల ఆధ్వర్యంలో విద్యార్థులకు కో వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు, ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు వయసు కలిగిన విద్యార్థులకు కో వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు, అందులో భాగంగానే వాకాడు మండల పరిధిలో  216 మంది విద్యార్థులకు ఈ వ్యాక్సిన్  వేశామన్నారు, వాకాడు గురుకుల పాఠశాలలో 184 మందికి గాను 135 మందికి, బాల్ రెడ్డి పాలెం హై స్కూల్లో 20 మందికి, వలమేడు హై స్కూల్ లో 26 మందికి, ఎస్ ఏ ఎల్ సి ఇ ఎఫ్ హైస్కూల్లో 35 మందికి చొప్పున మండలంలో ఉన్న 216 మందికి ఈ వ్యాక్సిన్ను వేశామని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో  బాలి రెడ్డి పాలెం ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు , ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.