పలమనేరు, ఫిబ్రవరి08,రవికిరణాలు : నూతన నటీనటులకు మాచే ఏర్పాటు చేస్తున్న పలమనేరు సినీ క్రియేషన్స్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం  పట్టణ మందలి గడ్డురు క్రాస్ వద్ద  పలమనేరు సినీ క్రియేషన్స్ వారి ఆఫీసు ప్రారంభిoచారు.ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ...దీని ముఖ్య ఉద్దేశం    యూట్యూబ్ , ఫుల్ల్   లెంగ్త్ మూవీస్ , సాంగ్స్ , కోసం ఈ ఛానల్ నిర్మించడం జరిగిందన్నారు.అలాగే అడిషన్స్ పేపర్స్ రిలీస్ చేయడం జరిగిందని అన్నారు. ఈ క్రియేషన్స్ డైరెక్టర్ గా  సతీష్ ,  హీరోయిన్ గా సురేషలేఖ కెమెరామెన్ గా ధరణి  మరికొందరు పాల్గొన్నారని కూడా ప్రొడ్యూసర్ క్రిష్ణప్రసాద్ తెలిపారు.ప్రధానంగా ఈ నెల  09వ తేదీ నుండి 13వరకు  అడిషన్స్  జరుగుతుందని తెలిపారు. మా క్రియేషన్స్ తరపున తీయబోవు సినిమాలకు నటీనటులు, స్క్రిప్ట్ రైటర్స్,సింగర్లు, డాన్సర్స్ కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు పలమనేరు సినీ క్రియేషన్స్ వారితో సంప్రదించాలని ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ కోరారు.