సూళ్లూరుపేట,జనవరి 6, (రవికిరణాలు) : సూళ్ళూరుపేట పట్టణ పరిధిలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కుటుంబ సభ్యులు జీవి కృష్ణయ్య, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి నెల్లూరు, ఎస్.వి.ఎస్.ఆర్ మూర్తి,హైకోర్టు జాయింటు రిజిస్టర్ ప్రోటో కాల్ ఏపి చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హరిత,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూళ్లూరుపేట,గూడూరు డిఎస్పి భువన హర్ష,నాయుడుపేట ఆర్ డి ఓ సరోజిని,ఆలయ పాలక మండలి సభ్యులు గోగుల తిరుపాల్, కర్లపూడి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.