వెంకటేశ్వరపురం జనార్ధనరెడ్డి కాలనీ హౌస్ ఫర్ ఆల్ స్కీము గృహాలను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ సందర్శించారు. వేల కోట్ల రూపాయలతో గృహ వసతి లేని పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు ఎల్‌ అండ్‌ టి వారిచే నిర్మించబడిన అపార్ట్మెంటులు, ఎస్‌ఎఫ్‌టి కి 1300 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా దానికి పైనే బ్లాక్ లో నడిచినట్లు అంచనాలు జరిగి కేవలం ఒక పార్టీ ప్రజలకు మాత్రమే ఈ పంపకాలు జరిగాయి అని అభియోగంతో కోర్టుని ఆశ్రయించి నిలిపివేశారు. ఉగాదికి హౌస ఫర్ ఆల్ స్కీమ్ కింద గృహల పంపిణీ చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం,వీటిని కూడా పంచనుందా, మరి అదే నిజమైతే పాత జాబితాలో వారికి కేటాయించినుందా,లేక కొత్త జాబితా ప్రకటించనున్నదా.. తమకున్న చిన్న వస్తువులను తాకట్టు పెట్టి,లేక అమ్మి ఇళ్లు కోసం అడ్వాన్స్ లు కట్టిన పేదలకు ప్రభుత్వం పేద ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెన్నారెడ్డి మనుక్రాంత్ తెలిపారు.ఈ విషయంలో పేద ప్రజలకు అన్యాయం జరగకుండా త్వరలో కలెక్టర్ ని కలవనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనుక్రాంత్ తో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు.