నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక మండల కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదవారికి పట్టెడణ్ణం పెట్టి పేద ప్రజల ఆకలి తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో నవరత్నాలు పేరు మీద 5 కోట్ల ఆంధ్రులను నమ్మబలికి ఓట్లు వేయించుకుని అందలం ఎక్కిన వెంటనే నిర్దాక్షిణంగా అన్నా కాంటీన్ ని మూసివేసి రాక్షసానందం పొందుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో నవరత్నాలులో భాగంగా పేదవారికి ఇళ్ళు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అని కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు అధికార గర్వం తలకెక్కి నవరత్నాలు అనే మాటను కాస్తా నవమోసాలుగా తనకు తానే అభివర్ణించుకున్నాడని దుయ్యబట్టారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడి ఇకనైనా మంచి పనులు చేసేలా బుద్ది చెప్పాలని అన్నారు. నాడు ఎంతో సుందరంగా ముస్తాబై ఫైవ్ స్టార్ హోటల్ అనుభూతి కలిగేలా 5 రూపాయలకే మూడు పూటలా కడుపు నింపుతున్న అన్నా కాంటీన్ లను తెరిపించాలని 
డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పులుకొల్లు రాజేశ్వరరావు, సిసి నాయుడు, కేవికే ప్రసాద్, పోలంరెడ్డి వెంకటరెడ్డి, కోటి రెడ్డి తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.