కోట, జనవరి 13, (రవికిరణాలు) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిట్టమూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు ఆటల పోటీలు, అంగన్వాడి ఆధ్వర్యంలో పోషకాహారాలు వంటల పోటీలు రంగుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు మండల స్థాయిలో గ్రామస్థాయిలో నిర్వహించినారు అని అన్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఆశ శ్రీనివాసులు దాతృత్వంలో గెలిచిన వారికి బహుమతులను ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో రవికుమార్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే అందరూ ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుగు ఏపీఓ ప్రసన్న అంగన్వాడి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు