- ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు

నెల్లూరు, జనవరి 13, (రవికిరణాలు) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధనలక్ష్మిపురంలోని ఏ.వి.రెడ్డి నగర్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ స్థానికులు సోమవారం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీల్లో కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి కాలనీ కమిటీ నిర్వాహకులు బహుమతులను అందజేశారు. అనంతరం స్థానికంగా నిర్మించనున్న దేవాలయానికి అంకురార్పణ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ
నిర్వాహకులు జి.వి. చలపతిరావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కాలనీవాసులు అందరూ కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం మంచి పరిణామం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేష్, కామయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.