వి ఎస్ యూ లో జాతీయ యువజనోత్సవం దినం సంబరాలు  విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ యువజనోత్సవం ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ఉపకులపతి   ఆచార్య జి యం సుందరవల్లి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 

అనంతరం పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ  వివేకానంద స్వామి 159వ జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి వివేకానంద ఒక గొప్ప ఆలోచనాపరుడు,  సంఘ సంస్కర్త, తత్వవేత్త  అని ఆయన ప్రభోదనలు అనేక విశ్వవిద్యాలయాలులో  తత్వశాస్త్రంలో పాఠ్యఅంశాలు గా బోధిస్తున్నారు అని అన్నారు.  బాల్య వివాహాలు అరికట్టడం లో  మరియు నిరక్షరాస్యత నిర్మూలించడంలో ఆయన విశేషమైన కృషి చేశారన్నారు. ప్రతిరోజూ  కొంత సమయమైనా  ప్రతి వ్యక్తి తనకు తానే మాట్లాడుకుంటే తనలో దాగి వున్న ఒక అద్భుత మనిషిని కనుగొంటాడన్న ఆయన మాటలు ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.

విశ్వవిద్యాలయంలోని యువత అందరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ  అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ప్రస్తుత సమాజ పరిస్థితులులలో యువతకు ఆయన నడిచిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.  

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్  డా . ఎల్ విజయ కృష్ణారెడ్డి గారు, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సి వి ఎస్ సాయి  ప్రసాద్ రెడ్డి  అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డా. ఆర్ ప్రభాకర్  మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు వివేకానంద స్వామి చిత్రపటానికి పూలు వేసి  నివాళులు అర్పించారు.