నెల్లూరు, జనవరి 10, (రవికిరణాలు) : నెల్లూరు నగరం బ్రహ్మా నందపురంలోని అవేన్యూస్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ లో ముందస్తు సంక్రాతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ అకడమిక్ డీన్ కృష్ణస్వామి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది. ఫ్రీప్రైమరి విద్యార్థులకు భోగిపళ్ళు అభిషేకం, అనంతరం తీపిపొంగల్ తయారీవంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్బంగా 6, 7 తరగతుల విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలు  చేశారు. ముందుగా రంగోలి ముగ్గులపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణచైతన్య, ప్రిన్సిపాల్ సుబ్బు రాయుడు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినివిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.