నెల్లూరుజిల్లాలో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎమ్.వి. శేషగిరి బాబు ఓ ప్రకటనలో తెలియజేశారు. అధికార యంత్రాంగం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంభందించి వివిధ పనుల్లో నిమగ్నమయినందున ఈ సోమవారం స్పందనను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంతో పాటూ ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలు, డివిజన్ స్థాయి కార్యాలయాలు, మండల స్థాయి కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఉండదన్నారు. ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.