ఆదివారం నగరంలోని సుంకు చెంగన్న మున్సిపల్‌ హైస్కూలు నందు జిల్లా అధ్యక్షులు ఎన్‌.నవకోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు విద్యారంగంలో మార్పుల పేరుతో ఉపాధ్యాయుల, విద్యార్ధుల తల్లితండ్రుల మధ్య గందరగోలం సృష్టిస్తున్నారని తెలుగురాష్ట్రాలలో పిల్లలు తెలుగు మీడియంలో తదువుకునే అవకాశం లేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీగా వున్నాయని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా వున్నాయని ఇందువల్ల విద్యారంగం కుంటుపడుతుందన్నారు. రాష్ట్రప్రదాన కార్యదర్శి పి.బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో  అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ ఎన్నికల ముందు యిచ్చిన హామీ సిపిఎస్‌ రద్దును ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పిఆర్‌సి అమలుపరచడంలో ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేది వరకు పోస్టుకార్డు ఉద్యమం, మార్చి 3వ తేది అన్నీ 
జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీలు, సభలు నిర్వహించడం, ప్రభుత్వం కదిలేవరకు దశవారీ పోరాటాలు చేస్తామన్నారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సమస్య త్వరలో పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయ బదిలీ వెసవి సెలవులలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జిల్లా డిఈఓ 15వ తేది నిర్వహించిన ప్రదానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్‌లో రెండు పోస్టులు ఎత్తిపె్టటి జరపడం అందులో రాజకీయ జోక్యం వుండటం, కౌన్సిలింగ్‌ విధానాన్ని తూట్లు పోడవడమే అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, కె.పరందామయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి కె.తులసీరామ్‌బాబు, కోశాధికారి వివి శేషులు, సహాధ్యక్షులు ఎమ్‌సి అచ్చయ్య, జిల్లా కార్యదర్శులు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్స్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.