నెల్లూరు, జనవరి 18, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ రామ్ నగర్‌కు చెందిన సి.శ్రీనివాసులురెడ్డి, 4వ డివిజన్ శ్రీనివాసనగర్‌కు చెందిన దండే రామిరెడ్డి, 6వ డివిజన్ వైటి.నాయుడువీధికి చెందిన కె.ఎరుకలయ్య, 7వ డివిజన్ లక్ష్మీపురం చెందిన ఎన్. జయచంద్రగుపా, 8వ డివిజన్ సిఆర్పి డొంకకు చెందిన పి.కృష్ణవేణి, 9వ డివిజన్ బంగ్లాతోటకు చెందిన చల్లా రాజశేఖర్‌ రెడ్డి, 9వ డివిజన్ కుసుమహరిజనవాడకు చెందిన మందా వెంకటరమణ, 10వ డివిజన్ రామచంద్రాపురంకు చెందిన సూరా కోటేశ్వరరావు, 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ కు చెందిన పసుపులేటి అనూరాధలకు ఆరోగ్యం సరిగా లేనందున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా॥ పి.అనీల్ కుమార్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే సి.శ్రీనివాసులురెడ్డికి 35 వేలు, దండే రామిరెడ్డికి 70 వేలు, కె.ఎరుకలయ్యకు 1.50 లక్షలు, ఎస్.జయచంద్రగుప్తాకు 30 వేలు, పి.కృష్ణవేణికి 25 వేలు, చల్లా రాజశేఖర్ రెడ్డికి 45 వేలు, మందా వెంకటరమణకు 45 వేలు, సూరా కోటేశ్వరరావుకు 28 వేలు, పసుపులేటి అనూరాధకు 75 వేల రూపాయల చెక్కులను విడుదల చేయించగా, బాధితులకు వైఎస్ఆర్‌సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి.రూప్ కుమార్‌యాదవ్ రాజన్నభవన్లో చెక్కులను అందజేశారు. రూప కుమార్‌ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అనేకమంది పేదలు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యశ్రీకి వర్తించక అనేక ఇబ్బందులు పడి ఆసుపత్రులలో చికిత్స పొంది వారి వారి సమస్యలను నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌కు చెప్పుకోగా, అందుకు స్పందించిన ఆయన 5.08 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు చెక్కుల రూపేణా అందించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మంజూరు కాని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పటివరకు లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక విద్య, వైద్యానికి నగర ప్రజలు దూరం కాకూడదని మంత్రి అనీల్ కుమార్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, అందుకు తనవంతుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అలాగే మంత్రి అయిన తరువాత సహాయసహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో పేదలకు, సామాన్యులకు మౌలిక వసతుల కల్పనలో తన శక్తికి మించి ప్రతివారం నెల్లూరు పర్యటనకు వస్తూ ఆయా ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ముత్రి అనీల్ కుమార్ మరెన్నో సేవా కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి
నాయకులు పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, దొంతాలి రఘు, కువ్వారపు బాలాజీ, మద్దినేని శ్రీధర్, సుప్రియ, గంధు సుధీర్ బాబు, వంగాల శ్రీనివాసులురెడ్డి, సుబ్బు, శంకర్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.