నెల్లూరు, జనవరి 24, (రవికిరణాలు) : శుక్రవారం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌ నందు పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యా షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రం 1-00 గం||లకు టౌన్ హాల్‌లోని మెమోరియల్ పోల్ (ఎ.సి) నందు "మత సామరస్యం" అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుందన్నారు. అనంతరం "సిఏఏ, ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్ అనుబంధ వ్యాసాలు" అను పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహితీప్రియులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య షంషుద్దీన్, అవ్వారు శ్రీధర్ బాబు, సుభద్రా దేవి, సుభాష్ పాల్గొన్నారు.