నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని కొత్తూరు సెంటర్లో కమల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా వందనం, రక్తదాన శిబిరాన్నినెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిప్రారంభించారు. ప్రమాదపు సమయాల్లో ప్రాణాలను నిలబెట్టుకునేందుకే ఈ రక్తదానం ఎంతో సహాయం చేస్తుంది కాబట్టి యువతలో అవగాహన పెరగాలని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఇటువంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్న కమల్ సేవా సమితికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.