నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలో ఇటీవల విడుదలైన కొత్త సినిమాల టిక్కెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారన్న పక్కా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిన్న బజార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు,సంతపేట సీఐ రాములు నాయక్, ఎస్ఐలు అలీ సాహెబ్, బలరామయ్య,రవి నాయక్ తదితరులు వలపన్ని ఐదు మంది బ్లాక్లో టిక్కెట్లు విక్రయిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి అలా వైకుంఠపురం..సరిలేరు నీకెవ్వరు కొత్త సినిమాలకు సంబంధించి వివిధ థియేటర్లకు సంబంధించిన 116 టికెట్లు.. 16 వేల నగదు.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు.