గిరిజన గురుకులాల్లో టీచర్ల కోసం జనవరి 6  తేదీ నుంచి బిక్షాటన ఈ రోజు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు BL శేఖర్ వెల్లడి మైదాన ప్రాంతంలోని 8 జిల్లాలోని 81గిరిజన గురుకులాల్లో 8,9,10 తరగతులకు టీచర్లు లేరు.486మంది టీచర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మరో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు. ఒక్కంటే ఒక్క గురుకుల పాఠశాలలో కూడా సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకులాల్లో టీచర్ల ను నియమించి గిరిజన పిల్లల భవిష్యత్తును కాపాడాలని పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ప్రాధేయపడినా ఫలితం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిక్షాటన చేసి తద్వారా వచ్చే నగదుతో గిరిజన గురుకులాల్లో టీచర్లను నియమించుకుని పిల్లల భవిష్యత్తు ను కాపాడుకుందామని నిర్ణయించాము. ఇందుకు అందరూ  సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికల గురుకుల పాఠశాల 260 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు ఉన్నారు. నెల్లూరు జిల్లా కోట బాలికల పాఠశాలలో 247 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు. ప్రకాశం జిల్లా కరేడులో 200 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు, కడప జిల్లా మైదుకూరు గురుకుల పాఠశాలలో 231 పిల్లలు ఉంటే ఐదుమంది మాత్రమే టీచర్లు ఉన్నారు. 81 గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక చదువులు ఎలా? అని ప్రశ్నించారు. గతంలో 81 హాస్టల్స్ ను రద్దు చేసి అదే పాత భవనాల్లో గురుకులాలను ఏర్పాటు చేశారు. 80 నుంచి 100  మంది స్థామర్థ్యం గల అక్కడ ప్రస్తుతం  ఒక్కో గురుకుల పాఠశాలలో 250 నుంచి 300 మంది అక్కడే మగ్గుతున్నారని వాపోయారు.  వసతుల్లేవు, చదువుల్లేవు. చదువు,భోజనం, పెట్టే,పడక ఒకే రూమ్ లోనే.  వసతుల్లేకపోయినా మా పిల్లలంతా  భరించారు. గురుకులాలు కదా మంచి చదువు అయినా వస్తుంది భావించారు. అదీ లేకపోవడంతో 17,128 మంది విద్యార్దినీ విద్యార్దుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన పిల్లల చదువుల కోసం సాగే బిక్షాటనలో అందరూ పాల్గొని జయప్రదం చేయడంతోపాటు BED, MED చేసిన గిరిజన నిరుద్యోగులు మన పిల్లలకు చదువులు చెప్పేందుకు ముందుకు రావాలని యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం తరపున కోరుతున్నాము. విలేకర్ల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, ఏకోల్లు సుబ్రమణ్యం, చెంబేటి ఉష, ఏకోల్లు లక్ష్మి, యువజన నాయకులు యల్లంపల్లి రమేష్, కల్లూరు లక్ష్మణ్, తిరివీధి సతీష్, మానికల నాగమణి, పాముల కోటేశ్వరమ్మ, బండి యశోద, బాపనపల్లి పద్మ, రంగయ్య, మేఘన పాల్గొన్నారు.