టిడిపి కార్యాలయంలో బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు...
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర  జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి బీదా రవిచంద్ర చేసిన సేవలను కొనియాడారు. ఆయన  ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలన్నారు. మరిన్ని గొప్ప పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.