రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అల్లరి మూకల దాడిలో టిడిపి కార్యాలయాల ధ్వంసం, భౌతిక దాడులు జరిగిన నేపథ్యంలో టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపిచ్చిన రాష్ట్ర బంద్ ను నిలువరించే ప్రయత్నం లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారిని నెల్లూరు, మాగుంట లేఔట్ లోని ఆయన నివాసంలో దర్గామిట్ట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసిపి నాయకులు, కార్యకర్తలు బరితెగించి టిడిపి నాయకులపై, టిడిపి కార్యాలయాలపై దాడులు చేస్తుంటే స్పందించని పోలీసులు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. పోలీసులు అత్యుత్సాహం అక్రమ హౌస్ అరెస్ట్ లలో కాకుండా దోషుల్ని శిక్షించడం లో చూపితే బావుంటుంది. దాడులు జరిగే సమయంలో మౌనం పాటించడం, దాడి అనంతరం టిడిపి నేతలు కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ ఇవ్వకుండా అరెస్టులు చేయడం, అనంతరం బాధితులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు నిత్యకృత్యం గా మారింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సజీవంగా ఉందని డీజీపీ భావిస్తే  టిడిపి కార్యాలయాలపై దాడులకు  పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.