సూళ్లూరుపేట,డిసెంబర్ 27, (రవికిరణాలు) : సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని పాలక మండలి ఛైర్మన్ మరియు సభ్యులను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ గా దువ్వూరు బాలచంద్ర రెడ్డి ,ఆలయ ట్రస్ట్ సభ్యులుగా
గోగుల తిరుపాల్ ,కర్లపూడి మదన్ మోహన్, ముంగరం అమరావతి, మద్దూరు శారదా, తాటిపత్తి వాణి, పొన్నా నాగమ్మ ,కామిరెడ్డి రేవతి,కీసరపల్లి నరేంద్ర ప్రమాణస్వీకారం చేసారు.నూతన పాలకమండలి చేత ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలక మండలికి ఈఓ చేతులు మీదుగా ఆలయ గౌరవాన్ని అందజేశారు. చెంగాలమ్మ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి మాట్లాడుతూ నన్ను ఎవరైనా కలవడానికి ఆలయంలోకి వస్తే దయచేసి రాజకీయం మాట్లాడవద్దు అని తెలియచేసారు. ప్రమాణస్వీకారోత్సవంలో సూళ్లూరుపేట నియోజక వర్గ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.