బిజెపి జిల్లా కార్యాలయంలో జనసేన బిజెపి  జిల్లా సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి మోడీతో బీజేపీ వలనే సాధ్యమవుతుందని ఉన్నత భావాలు కలవారు కాబట్టే మోడీతో పవన కళ్యాణ్ కలవడం జరిగింది అని సామాన్య ప్రజలకు న్యాయం జరగాలన్నా సమగ్ర అభివృద్ధి కై ఇరుపార్టీలు కలిసి పనిచేయాలని తెలియజేశారు.ఇరు పార్టీలలో స్థానికంగా ఉన్న పట్టును బట్టి సీటు విషయంలో సర్దుబాట్లు ఉంటాయని,అవి చూసుకొని ఎవరు పోటీ చేస్తారు అనేది లిస్టు ప్రకటిస్తామని, ప్రస్తుతం ఈ ప్రభుత్వం విధానానికి ప్రజలు విసిగిపోయి ఉన్నారని బిజెపి జనసేన ఉమ్మడి  
మేనిఫెస్టో రెండు రోజుల్లో విడుదల అవుతుంది మేనిఫెస్టో ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి గెలుపు దిశగా ప్రయత్నాలు సాగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సచివాలయ వాలంటీర్లను పార్టీ తరఫున ఎక్కడన్నా వాడినట్లయితే  వారి మీద నిఘాఉంచాలనీ,స్థానిక ఎన్నికలలో అవినీతి జరగకుండా డబ్బు మద్యం పంపకాలుల జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపర్తి కిషోర్,గునుకుల కిషోర్,డాక్టర్ అజయ్, శ్రీకాంత్, ప్రవీణ్ బిజెపి సీనియర్ నాయకులు భరత్ కుమార్, సురేష్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, వంశీ, హర్షవర్ధన్,రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు