ఆత్మకూరు, జనవరి 24, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆదేశాల మేరకు బాలికలను కాపాడండి, దిశ చట్టం పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆశ వర్కర్స్, అంగన్ వాడీ, ఏఎన్‌ఎమ్‌, విద్యార్థిని విద్యార్థులు, అన్ని శాఖల వారు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి చెన్నయ్య, ఆర్‌డివో ఉమాదేవి, డిఎస్పి మక్బూల్, తహసీలదార్, ఎమ్‌పిడివో ఇతర అధికారులు, వీరితో పాటు డాక్టర్‌. శ్రావణ్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు అల్లా రెడ్డి ఆనంద్ రెడ్డి యువత అధ్యక్షులు నాగుల పాటి ప్రతాప్ రెడ్డి  వైసిపి నాయకులు చల్లా రవి కుమార్ రెడ్డి నోటి వినయ్ కుమార్ రెడ్డి, ఇతర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు.