నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ భాస్కర్ భూషణ్ వారి ఉత్తర్వుల మేరకు నెల్లూరు పట్టణంలో ప్రభుత్వ నిషేదిత పదార్ధాలైన ప్రాణాలకు హాని కలిగించే గుట్కా, పొగాకు గంజాయి వంటి ఉత్పత్తులను ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేఖంగా అమ్ముతున్న వారి పై ఉక్కుపాదాలను మోపాలని నెల్లూరు పట్టణ సట్ డివిసినల్ పోలీస్ ఆఫీసర్ జె.శ్రీనివాసులు రెడ్డి వర్యవేక్షణలో, చిన్నబజారు పి.యస్. సి.ఐ ఎమ్.మధుబాబు వారి సిబ్బందితో కలిసి నిషేధిత పదార్ధాలైన గుట్కా పాన్ మసాలా, జర్ద మరియు గంజాయిని నిల్వ చేసి ఇంటిని సైతం గుడాన్ గా మార్చి బడ్డీ బంకు ముసుగులో వ్యాపారం చేస్తున్న ముద్దాయి నాగలాపురం వెంకటేషన్ ఇంటివద్దనే అరెస్టు చేసి అతని ఇంటిలో నిల్వ ఉంచిన సుమారు రూ.260000 విలువ చేసే గుట్కా పాన్ మసాలా, జర్దా 190 టిన్నులు, 83767 సాచెట్లు, సుమారు రూ.20000 విలువ చేసే మత్తు పదార్ధమైన 2కిలోల గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. ముద్దాయి ప్రభుత్వ నిషేదిత పదార్ధాలను కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, ఆంధ్రలోని వైజాగ్ ఏజన్సీ ప్రాతాలనుండి తీసుకు వచ్చి పట్టణంలో వివిధరకాలుగా వ్యాపారం చేస్తున్నట్లుగా విచారణలో తెలిపినాడు.