అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలసి భర్తను హత్య చేయించిన భార్య 
బేర్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబంలో చిచ్చురేపిన అక్రమ సంబంధం

గత నెల 22 న కొత్తూరు దాటిన తరువాత పోలీసు ఫైరింగ్ రేంజి దగ్గర గుర్తు తెలియని మగ మనిషిని చంపి నీళ్ళు లేని కాలువలో 20 అడుగుల లోతులో పడవేసిన శవం ఆనవాలు గుర్తు పట్టలేని విధంగా పెట్రోలు పోసి కాల్చివేసిన కేసులో వేదయపాలెం పిఎస్‌, సిఐ, సెక్టార్- I- ఎస్సై, క్రైమ్ పార్టీ సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించి చేధించి, శుక్రవారం ఉదయం అరెస్టు చేసారు.దర్యాప్తులో భాగంగా నెల్లూరు జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ డిఎస్పి జె.శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో, నెల్లూరు వేదాయపాలెం పి.ఎస్‌, ఇన్స్పెక్టర్ టివి సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్ - బి లక్ష్మణ్ రావు, సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు కొనసాగించారు. మృతుడు, అతని భార్య భద్రమ్మ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. వీరు సుమారు 2 సంవత్సరాల క్రితం బేల్దారు పనులు నిమిత్తమం నెల్లూరుకు వచ్చిఉమ్మారెడ్డి గుంటలో నివాసం వున్నట్లు, మృతుడు బేల్దారు పనులకు వెళ్తున్నట్లు, మృతుని భార్య సుధాకర్ అను బేల్దారు మేస్త్రి వద్దకు కూలి పనులకు వెళ్తున్నట్లు. ఆ క్రమములో ఇరువురు మధ్య సుమారు 6 నెలలు నుండి అక్రమ సంబంధం ఏర్పడినట్లు. సదరు అక్రమ సంబంధం విషయం భద్రమ్మ భర్త అయిన సూర్య నారాయణకి తెలిసి ముందు నచ్చ చెప్పినట్లు, అయిననూ విననందున, వారి బంధువులు అందరికి అక్రమ సంబంధం విషయం చెప్పినందున, మృతుడిపై ద్వేషం పెంచుకొని, సుధాకర్ మరియు మృతుని భార్య కలసి ఒక పథకం ప్రకారం సూర్యనారాయణను చంపివేయాలని నిర్ణయించుకొని, ముందుగానే ఇరువురు పోలీసు పైరింగ్ రేంజి వద్దకు పోయి ప్రదేశంను ఎంచుకొని, ఇక్కడే చంపి కాలువలో వేసి కాల్చి వేయాలని నిర్ణయించుకొని, తేది 12.02.2020 న పథకంలో భాగంగా భద్రమ్మ మృతునితో గోడవపెట్టుకొని, ఇంటి నుండి వెళ్లినట్లు, అదే రోజు సుధాకర్ మృతునికి ఫోన్ చేసి నీకు బేల్దారు పనులు ఇప్పిస్తానని ఆశ చూపించి, పిలిపించుకొని, పనులు ఇచ్చే మేనేజర్ కొత్తూరు ఏరియాలో వున్నాడని చెప్పి, మృతుడుని తీసుకొని పోతూ, మార్గమద్యంలో మద్యం కొనుక్కొని, సదరు నేరస్థలానికి వెళ్లి అక్కడే మద్యం తాగించి, మద్యం మత్తులో వున్న సూర్యనారాయణను బండరాయి తీసుకొని తల వెనుక భాగంలో మరియు ఛాతి పై భాగంలో కొట్టి, వారి పథకం ప్రకారం తీసుకొని పోయిన చవక కర్రతో కూడా ఛాతి భాగం లో కొట్టి, చంపి, కాలువలో పడవేసి ఆనవాలు గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి కాల్చి వేసినాడు. దర్యాప్తులో ఈ రోజు ఏ1, ఏ2 లను అరెస్టు చేసినారు. సదరు ముద్దాయిల అరెస్టు విషయంలో కృషి చేసిన క్రైమ్ పార్టీ సిబ్బంది ఏఎస్‌ఐ ప్రసాద్, హెచ్‌సి లు సుధాకర్, విజయ మోహన్, జిలాని, పిసి లు గోపాలయ్య, మస్తాన్, డబ్ల్యూపిసి వాసవి లకు రివార్డులను ఎస్పీ కి సిఫారసు చేయడమైనది.