నెల్లూరు, పిబ్రవరి 10, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పి క్రైమ్స్ పి.మనోహర్ రావు పర్యవేక్షణలో క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్స్ ఐ.శ్రీనివాసన్, జి.రామారావు, ఎస్.కె.బాజిజాన్ సైదా, ఆత్మకూరు సి.బి. బి.పాపారావు, కోవూరు సి.ఐ. జి.ఎల్. శ్రీనివాసరావు, సి.సి.ఎస్. ఎస్.ఐ.లు ఎస్.కె. ఎమ్.డి. హనిఫీ. బి.శివప్రకాష్, ఆత్మకూరు ఎస్.ఐ.సంతోష్ కుమార్ రెడ్డి, కోవూరు ఎస్.ఐ. సి.హెచ్. క్రిష్ణారెడ్డిలు సి.సి.ఎస్. సిబ్బందికి రాబడిన సమాచారము మేరకు తేది 09.02.2020 సాయంత్రం 4.10 ని||లకు నెల్లూరుపాళెం సెంటర్, ఆత్మకూరు టౌన్ వద్ద నలిశెట్టి మహేషను అరెస్టు చేసి, చోరిసొత్తు 12 1/2 సవర్ల బంగారు ఆభరణములు (విలువ సుమారు 3 లక్షలు)ను తేది 10.02. 2020 ఉదయం 8.45 గం||కు సాలు చింతల సెంటర్, కోవూరులో షేక్ గయాజ్, షేక్ హమీద్ బాషాలను అరెస్టు చేసి చోరిసొత్తు సుమారు 16 1/2 సవర్ల బంగారు ఆభణములు (విలువ సుమారు 4.5 లక్షల రూపాయలను) స్వాధీనము చేసుకున్నారు. పై నేరస్థులు గతంలో కూడా ఇంటి దొంగతనములు చేసి జైలుకు వెళ్ళి వున్నారు.