ప్రాపర్టీ అఫెన్స్ కేసులలోని 6 మంది ముద్దాయిలు అరెస్ట్ 
సుమారు 20 సవర్ల బంగారు ఆభరణములు స్వాధీనం 
చాక చక్యంగా అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

నెల్లూరు జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్ ప్రత్యేక బృందాలను ఏర్పరిచి, ప్రాపర్టీ అఫెన్స్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి, రికవరీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ అడిషనల్ ఎస్.పి క్రైమ్స్ పి.మనోహర్ రావు నెల్లూరు టౌన్ డిఎస్పి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో, క్రైమ్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ యస్.కె.బాజీజాన్ సైదా, జి.రామారావు, నవాబుపేట పిఎస్‌-యస్.ఐ బి.శివ ప్రకాష్, సి.సి.యస్. జిల్లా సిబ్బంది ఒక ప్రత్యేక బృందముగా ఏర్పడి బ్యాగ్ లిఫ్టింగ్, ఇతర నేరములు చేసి తప్పించుకొని తిరుగుచున్న నేరస్థులను గురువారం ఉదయం 09.00 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద చోరీ సొత్తు షుమారు 11 సవర్ల బంగారు ఆభరణములను స్వాధీన పరచుకోవడమైనది.