పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

రాపూరు : రాపూరు మండలంలోని సంక్రాంతిపల్లి గ్రామంలో వెంకటగిరి నియోజక వర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి నూతన సచివాలయం శిలాపలకలు ఆవిష్కరించారు. అనంతరం ఆశావర్కర్లతో కలిసి వైఎస్ఆర్ మూడవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కంటి వైద్యం అందించేందుకు వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని వైద్యులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.