జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ భవన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగంగా ఇంచార్జ్ సూపరెంటెండింగ్ ఇంజనీర్ జె. రమణదేవి మరియు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. శ్రీహరిరావు మాట్లాడుతూ*

 *నెల్లూరు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు జరుగుతాయి అని తెలిపారు, విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు*

*విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు*

*విద్యుత్ ను పొదుపు గా వినియోగించడం వలన సహజ వనరులను ఎక్కువ కాలం వినియోగించుకోవచ్చని అది భవితరాలకు మనం ఇచ్చే బహుమతి అని తెలిపారు*

*రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పొదుపు చేయడం కోసం పలు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు*

*పరిశ్రమలు, వ్యవసాయం మరియు భవన నిర్మాణం తదితర కీలక రంగాలలో ఇందన పొదుపు వేగవంతం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు*

*సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బుల వాడకంతో 60 శాతం విద్యుత్ అదా అవుతుందని, ఫ్రీజ్ లు, ఏ.సి. లు స్టార్ రేటెడ్ పరికరాలు వాడటం వలన కూడ విద్యుత్ పొదుపు చేయవచ్చని తెలిపారు*

*గృహ, వాణిజ్య వినియోగదారులు వీలైనంత వరకు పగలు లైట్ల వాడకం తగ్గిస్తే మంచిదని తెలిపారు*

*విద్యుత్ ఎంతో విలువైనదని, దాన్ని నిర్లక్ష్యంతో వృధా చేయరాదని తెలిపారు*

*ఒక యూనిట్ విద్యుత్ ను ఆదాచేస్తే రెండు యూనిట్ ల విద్యుత్ పొదుపు చేసినట్లేనని తెలిపారు*

*వ్యవసాయ వినియోగదారులు ఐయెస్ఐ మార్క్ గల పంపుసెట్లు, నాణ్యమైన పుట్ వాల్వ్, కేపాసిటర్లు వాడడం ద్వార విద్యుత్ పొదుపు చేయవచ్చని తెలిపారు*

*ఈ కార్యక్రమం లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డి. సురేంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్ జి.మధు కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అల్తాఫ్, మధుసూదన్ రెడ్డి, దొరస్వామి రెడ్డి మరియు ఇంజనీర్ సిబ్బంది, అకౌంట్స్ సిబ్బంది పాల్గొన్నారు*