కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది 
కోటలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న రైతన్నను ఆదుకునే దిక్కే లేదా

ఈశ్వరవాక గ్రామంలో బొల్లి సుబ్రహ్మణ్యం అనే రైతుకు 1.1/4 సెంట్లు కౌలుకు 1 ఎకరా... మొత్తం 2.1/4 సెంట్లు భూమిలో వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఈమధ్య వర్షాలు సరిగా లేక భూమిలో నీరు అందక వేసిన పంటలు చేతికి రాక ముగ్గురు బిడ్డల పోషణకై మరియు పంట వేసుకున్నందుకు బయట అప్పులు చేసే వాడు అదే క్రమంలో ఈసారి వర్షాలు బాగా పడడం నీరు సమృద్ధిగా ఉండడంతో ఆనందంతో మరికొంత ఎక్కువ అప్పు చేసి పంట వేశాడు అయినా ఆ రైతు పై ప్రకృతి కన్నెర్ర చేసి వేసిన వరి కు వారిపుండ్లు పడి ఆశించిన పంట చేతికి రాకపోగా వచ్చిన అరకొర పంట ఆశించిన రేటు లేకపోవడంతో వచ్చిన  కొంత నగదు తో అప్పులు కట్టలేక అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపణ ఆ రైతు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కోట పరిధిలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స 
పొందుతున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి అన్నదాతల ఆవేదన అర్థం చేసుకుంటే బాగుంటుందని ఆశిద్దాం.