నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పోస్టుమెట్రిక్ కాలేజ్ హాస్టల్ మరియు బి.సి. బాలికల హాస్టల్లో ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో ఆర్.ఓ. ప్లాంట్లను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

 అన్ని రాజకీయపార్టీల సూచనలు మరియు సద్విమర్శలు సైతం స్వీకరించి, ఎక్కడా రాజకీయభేదాలకి తావివ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకుపోతా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 ఆర్.ఓ. ప్లాంట్ కు ఎమ్.పి. గ్రాంట్ క్రింద 5 లక్షల రూపాయల నిధులు విడుదల చేసిన ఎమ్.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు  అనేక గ్రామాలలో తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక రూరల్ నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 భవిష్యత్తులో 23వ డివిజన్, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పోస్టుమెట్రిక్ కాలేజ్ హాస్టల్ మరియు బి.సి. బాలికల హాస్టల్లో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో చేసితీరుతాం.  రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్  రెడ్డి.