ఫిట్ నెస్ లేని కళాశాల పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి

ఫిట్ నెస్ లేని ఆదిశంకర కళాశాలల బస్సుల పై చర్యలేవి

రవాణా శాఖ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు

చర్యలు వెంటనే తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో,రవాణా శాఖ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ మనోజ్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలోని ఫిట్ నెస్ లేని కళాశాల బస్సులు మరియు పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలని, బస్సులు ఫిట్ నెస్ లేకపోవడం వల్ల ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారని, గతంలో కూడా ఆదిశంకర కళాశాల బస్సు యాక్సిడెంట్ గురువారం జరిగింది నిన్న కూడా వెంకటగిరి రూట్ లో వాస్తు చక్రం ఊడిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది, వెంటనే ఫిట్ నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న, కాశీ రామ్, చరణ్ , ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు