గూడూరు, జనవరి 08, (రవికిరణాలు) : చవటపాలెంలో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణాంధ్ర భారతి క్యాంపస్ సెంటర్  వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ నిర్భయ అభయ దిశ చట్టాలు వచ్చినా కానీ మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు నిత్యం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని గూడూరు లో మతిస్థిమితం లేని మహిళ పైన అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని  ఈ ఘటనను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ నిందితులను శిక్షించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దొరబాబు జిల్లా కన్వీనర్ కార్తీక్, నగర కార్యదర్శి శ్యామ్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, విద్యార్థినిలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.