మిలాద్-ఉన్- నబీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గార్లు...

మహమ్మద్ ప్రవక్త జన్మించిన అత్యంత పవిత్రమైన రోజును పురస్కరించుకొని మిలాద్-ఉన్- నబీ పండుగ జరుపుకుంటారు.

పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరులో ఖాదర్ వలీ ఆధ్వర్యంలో, మైపాడు గేట్ చెక్ పోస్ట్ వద్ద షంషీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు స్వయంగా భోజనాన్ని వడ్డించారు...

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ....

ఈ యొక్క పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా శుభకరమైన రోజుగా భావిస్తారు అని అన్నారు...

ఇటువంటి పవిత్రమైన రోజున స్థానికులు అందరూ కలిసి అన్నదానం చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు...

ప్రవక్తలందరూ మనకి మంచి మార్గం చూపడానికి వస్తారని, ఒక కులం కోసమో, మతం కోసమో వచ్చే వారు కాదు యావత్ ప్రపంచం కోసం, మానవుల కోసం వస్తారని అన్నారు...

మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు మాట్లాడుతూ....

అన్నీ దానాల్లో కల్ల అన్నదానం గొప్పదని, పండుగను పురస్కరించుకుని అన్నదానం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు....

మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...

పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, ప్రశాంత్ కుమార్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, మామిడాల మధు, మాతంగి కృష్ణ, సత్తార్, కరిముల్ల, తదితరులు పాల్గొన్నారు..