26వ డివిజన్లో స్థానిక నాయకులు జెన్నీ రమణయ్య,మాతంగి కృష్ణ,ఒంటి కృష్ణయ్య, బిరుదవోలు కృష్ణ,బిరుదవోలు పెంచలయ్య, ఆధ్వర్యంలో మన నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జ్ మాజీ మేయర్ అబ్దుల్ కి ఘాన స్వాగతం పలకడం జరిగింది స్థానిక మహిళలు కర్పూర హారతులతో, మేళతాలలతో అబ్దుల్ అజిజ్ కి స్వాగతం పలికారు. అనంతరం సర్వ మాట ప్రార్థనలు నిర్వహించారు తదుపరి ఎన్టీఆర్ జ్యోతిరావు పూలే, జగత్ జీవన్ రావ్, జ్యోతి రావ్ పూలే, డాక్టర్‌ బి ఆర్ అంబెడ్కర్ చిత్రపటలకు మాలలు వేసి పార్టీ జెండా అవిష్కారణ చెయ్యడం తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు స్థానిక తెదేపా నాయకులు ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. ఇంటిఇంటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. తెదేపా హయంలో దాదాపు 60 కోట్ల రూపాయలతో ఆ వార్డులో చేసిన అభివృద్ధి తాలూకు కరపత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఈ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన బద్దెపూడి చిన్న సుబ్బయ్య, కోళ్లఫారం కోటయ్య మరణించిన సందర్బంగా వల్ల ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అలాగే పెన్షన్ రద్దు చేయబడిన వృద్ధులను,వికలాంగులను, వితంతువులను ఇంటిఇంటికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పి మీ పెన్షన్లు,రేషన్లు, ఇతర సంక్షేమ పథకాలు మీకు తిరిగి ఇచ్చేవిధంగా మేము కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నగర తెదేపా అధ్యక్షులు మాజీ నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, ఖాజావాలి, మనోహర్ రెడ్డి, సాబీర్ ఖాన్,పద్మజ యాదవ్,రేవతి,సెల్వి,పద్మ వివిధ తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.