ఆంద్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కోశాధికారిగా అఖిల భారత చిరంజీవి యువత కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకల రవీంద్ర బాబు ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉందని చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఎపిపిఎస్‌ఏ కోశాధికారిగా ఎన్నికైన రవీంద్రబాబుని గుంటూరులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందచేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొట్టే మాట్లాడుతూ చిరంజీవి ఇచ్చిన పిలుపు మెరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన రవీంద్ర ప్రయివేటు పాఠశాలల రాష్ట్ర కోశాధికారిగా కూడ మంచిపేరు తెచ్చుకొని భవిష్యత్తు లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.