ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన కొండూరు అనీల్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని రాష్ట్ర ఫిషరీస్ కమీషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల షిషరీస్ సొసైటీల అధ్యక్షులు కలిసి కొండూరు అనీల్ బాబును రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకున్నారు.