కడప ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్‌ సుమో, కారు ఢీకొట్టుకున్నాయి.. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రచందనం తరలిస్తున్న సుమోను టిప్పర్ ఢీకొట్టింది.. వెంటనే మరో కారు కూడా టిప్పర్‌ను ఢీకొట్టింది. కడప-తాడిపత్రి మధ్య గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో ప్రమాదం జరిగింది. సజీవ దహనమైన నలుగురు ఎర్రచందనం స్మగర్లుగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు.. స్మగ్ర్లు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్ల పైలట్ కారుగా గుర్తించారు.. గాయపడినవారిని రిమ్స‌్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.