నెహ్రూ యువ కేంద్ర గూడూరు  ఆధ్వర్యంలో స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు యువకులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటా సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి యువత వెన్నెముక అని ప్రతి యువకుడు దేశం గురించి ఆలోచించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ఆయన కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు వ్యాయామం అనేది చాలా అవసరమని ఆయన అన్నారు ఆటల పోటీలు విద్యార్థులు యువత పాల్గొనడం చాలా సంతోషమని, ప్రతి ఒక్కరు గెలుపు ఓటములతో కాకుండా ప్రయత్నించడం చాలా మంచి విషయమని ఆయన అన్నారు ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ జేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిధులుగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి గారు, నారాయణ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ గారు, ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ గారు, ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రముఖ మల్లికార్జున గారు నారాయణ కళాశాల ఏవో కొండారెడ్డి గారు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ చిన్న గారు తదితరులు పాల్గొన్నారు