ఉన్నత విద్యార్హతలు కలిగిన మీరు ఈ ఉద్యోగాలు పొందడం అభినందనీయం, ఫీల్డ్ లో కష్టపడి పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి - అడిషనల్ యస్పి(అడ్మిస్) 
మీ పరిధిలో చట్టాల గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి 
పోలీసు కుటుంబంలో మేము భాగస్వామ్యులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది క్షణార్ధులు 
ఆరవ బ్యాచ్ లో 173 మంది అభ్యర్థినులు పాసింగ్ ఔట్

జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు ఆరవ బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసు అధికారుల) 2 వారాల శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో విజయవంతంగా ముగిసిన సందర్భంలో శనివారం డిటిసి ప్రిన్సిపల్- అడిషనల్ యస్పి(అడ్మిన్) పి.వెంకటరత్నం శిక్షణార్ధులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా అడిషనల్ యస్పి(అడ్మిన్) మాట్లాడుతూ ఉన్నత విద్యార్హతలు కలిగిన మీరు ఈ ఉద్యోగాలు పొందడం అభినందనీయమని, మహిళలు, వృద్ధులు మరియు బాలలకు రక్షణ మరియు భద్రత కల్పించడంలో పాటు వారిపై జరిగే నేరాలను అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు మెరుగైన సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.దిశ చట్టం, సఖి(ఒఎస్‌సి) వంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక్కడ నేర్పిన యోగా, కరాటే వంటి శారీరక వ్యాయామం రోజూ అలవాటు చేసుకోవాలని, మహిళా పోలీసు అధికారులందరూ ఫీల్డ్ మీద తిరిగితేనే మీకు పూర్తి అవగాహన వస్తుందని, తద్వారా సమస్యకు వెంటనే పరిష్కారం చూపగలరని, ప్రతి విషయాన్ని ఎస్‌హెచ్‌ఒ కి తెలియజేయాలని తెలిపారు. మీ సమస్యలను, అవసరాలను మాకు ఏ సమయంలో అయినా తెలపవచ్చని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని సూచించారు. సురక్షిత వాతావరణంలో విధులు నిర్వహించేందుకు 
అన్నీ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిటిసి డిఎస్పి ఎస్‌వి గోపాల క్రిష్ణ కో ఆర్డినేట్ చేస్తూ ఈ బ్యాచ్ లో మొత్తం 173 మంది శిక్షణ పూర్తి చేసారని, ఈ బ్యాచ్ నందు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మహిళలు శారీరకంగా మాత్రమే బలహీనులు మానసికంగా చాలా దృఢమైన వారు అని, భ్రూణ హత్యలు, ఆత్మ హత్యలను పూర్తిగా నిర్మూలిస్తారని ఆశిస్తూ, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. డిఎస్పి(ఏఆర్‌) రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ నుండి మొదలైన ఈ ట్రైనింగ్ మీది చివరి బ్యాచ్, ఇప్పటి వరకు 819 మందికి శిక్షణ పూర్తి అవుతుంది. సొంత మండలానికి సేవ చేసే అవకాశం వచ్చినందున క్రమ శిక్షణ నిబద్ధతతో పనిచేయాలని, గ్రౌండ్ లెవల్ లో పోలీసు వారికి పూర్తి సహకారం అందించాలని తెలిపారు. అనంతరం అడిషనల్ యస్పి(అడ్మిన్) టాప్ లో నిలిచిన ఎస్‌కె.కైరుణ్ బీ, ఏ.జ్యోతి, ఏ.సాయి శిరీష, ఎస్‌కె.మెహరాజ్ కు మెరిట్ సర్టిఫికేట్ లు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పి(అడ్మిన్)తో పాటు డిటిసి డిఎస్పి ఎస్‌వి గోపాల క్రిష్ణ, డిఎస్పి(ఏఆర్‌), డిటిసి- రిజర్వు ఇన్స్పెక్టర్ సురేష్, అన్ని స్టేషన్ ల ఎస్సైలు, ఆర్‌ఎస్సై, ఏఎస్‌ఐ శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.