దేవస్థానంలో దుర్గాహోమం

గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి అభిషేకం,అలంకారం,పులంగిసే వ,ఉపదేవతలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లలితసహస్రనామ సంపుటి కరణ, దుర్గా హోమము,అమ్మవారి ముల మంత్ర హోమం,పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి.దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు.దేవస్థాన కమిటీ చైర్మన్ దువ్వూరు విజయభాస్కరరెడ్డి, వైస్ చైర్మన్ కొండూరు కోదండరామయ్య,కార్యదర్శి ఏలూరు శ్రీనివాసులురెడ్డి, గాడి మేరీ గోపికృష్ణ, గురవయ్య తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.