చిత్తూరు: జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలంలోని చిలమత్తూరు చెక్ పోస్ట్ వద్ద చిత్తూరు జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు పుత్తూరు డి ఎస్పీ ఆధ్వర్యంలో సత్యవేడు సిఐ  శ్రీనివాసులు, వరదయ్యపాలెం ఎస్‌ఐ పురుషోత్తం రెడ్డి,వాళ్ల సిబ్బందితో కలిసి నిన్న రాత్రి  ఇసుక వాహనాలు తనిఖీ చేస్తుండగా తనిఖీ చేస్తుండగా తడ వైపు నుంచి వరదయ్యపాలెం కు వస్తున్న టిఎన్‌ 04ఏవి 9909 వాహనం ఆపి తనిఖీ చేయగా అందులో ఐదు బ్యాగులు వెండి పట్టుబడ్డాయి అందులో ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తిని బిల్ చూపించమని అడగగా అతను ఎటువంటి బిల్లులు చూపించక పోవడంతో  వెండిని సీజ్  చేశామని సత్యవేడు సిఐ శ్రీనివాసులు వరదయ్యపాలెం ఎస్ఐ పురుషోత్తం రెడ్డి మీడియాకు తెలిపారు.